- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంధ్రోడి చేతిలో TSPSC తాళాల గుత్తి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘సిట్ అంటే స్టాండ్ మాత్రమేనని” టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సిట్ ద్వారా టీఎస్పీఎస్సీ లీకేజ్ పూర్తిగా బయటపడదన్నారు. గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని ప్రశ్నించారు. డ్రగ్స్, నయీమ్ ల్యాండ్, గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే కొనుగోలు అంశం వంటివన్నీ పక్కదారి పట్టాయన్నారు. పైగా ఆంధ్ర వ్యక్తి చేతిలోనే సిట్ బాధ్యతలు ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఎలా మేలు జరుగుందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అనుకూలంగా నివేదికలు వచ్చే ఛాన్స్ ఉన్నదన్నారు.
ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలను డిటేల్స్ పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని హైకోర్టును కోరామన్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు సిట్ విచారించిన విషయాలను కూడా తెలపాలని కోరినట్లు చెప్పారు. పేపర్ లీకేజ్ అంశం ప్రవీణ్, రాజశేఖర్‌లకే పరిమితం కాదని, చైర్మన్, సెక్రటరీలు, శంకర్, లక్ష్మీలను కూడా బాధ్యులుగా చేర్చాలన్నారు. టీఎస్పీఎస్సీ తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సుమారు 30 లక్షల నిరుద్యోగులు చుక్కలు చూస్తున్నట్లు పేర్కొన్నారు.