Ayushman Bharat: వీరు ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హులు కాదు..ఈ జాబితాలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి

by Vennela |   ( Updated:2025-04-16 04:18:26.0  )
Ayushman Bharat: వీరు ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హులు కాదు..ఈ జాబితాలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి
X

దిశ,వెబ్ డెస్క్: Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ యోజన 2018లో ప్రారంభం అయ్యింది. ఈ స్కీములో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హులేనా కాదా అనేది అన్ లైన్ లోనే తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

ఆర్థికంగా బహీనంగా ఉండి..సామాజికంగా వెనబడిన వర్గాలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా పథకాల్లో ఇది ఒకటి. ఈ స్కీములో చేరినవారికి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. దీని ద్వారా రూ. 5లక్షల వరకు ఫ్రీగా చికిత్స పొందవచ్చు. 70ఏళ్లు దాటిన వ్రుద్ధులు, వారి ఆదాయం ఎంత ఉన్నా ఈ స్కీములో చేర్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. వారికి ఆయుష్మాన్ వయ్ వందన్ కార్డును అందిస్తున్నారు.

అయితే ఈస్కీము అర్హులు ఎవరంటే పేదలు, అవసరమైన వారు ఉచితంగా వైద్యం పొందేందుకు అందిస్తోంది. పీఫ్ కట్టే ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, లేదా ఈఎస్ఐసీ ప్రయోజనాలు పొందేవారు ఆయుష్మాన్ కార్డుకు అర్హులు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలు 16 నుంచి 59ఏళ్ల మధ్య వయసు గల పురుషుడు లేదా వారి కుటుంబం ఈ స్కీముకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, భూమిలేని కూలీలు, పట్టణాల్లో రాక్ పికర్లు, హౌస్ మైడ్స్, కూలీలు, స్ట్రీట్ వెండర్స్ వంటి వర్గాలు అర్హులు.

మీరు ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ముందుగా మీ అర్హతను అన్ లైన్ లో చెక్ చేయాలి. ఇప్పుడు అధికారిక వెబ్ సైట్ https://pmjay.gov.in కి వెళ్లి అక్కడ "Am I Eligible" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఈ స్కీముకు అర్హులు కాదా అనేది సైట్ చూపిస్తుంది.



Next Story

Most Viewed