- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్-1 (Group-1) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి 21 వరకు నాంపల్లి (Nampally)లోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ (Suravaram Prathapa Reddy Varsity)లో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అదేవిధంగా టీజీపీఎస్సీ (TGPSC) వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా అందుబాటులో ఉంచామని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. పోస్టులకు ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికెట్ల (Original Certificates)తో పాటు రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీ (Photostat Copy)లను అభ్యర్థులు వాటిపై తమ సంతకాలు చేసి వెరిఫికేషన్‌కు వెంట తీసుకురావాలని తెలిపారు.