- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్కినేని హీరోకు పక్కా హిట్ ఇస్తా అంటున్న శ్రీ లీల.. నీకే గతిలేదు నువ్వేమ్ ఇస్తావంటూ ట్రోల్స్(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్(Akkineni Akhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరగా ‘ఏజెంట్’(Agent) సినిమాలో నటించి భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’(Lenin) సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక దీనికి కిశోర్ అబ్బూరు(Kishore Abburu) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. లెనిన్ సినిమాలోని శ్రీ లీల, అఖిల్ పోస్టర్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో శ్రీ లీల నీకు నేను హిట్ ఇస్తా గురు అని చెబుతున్నట్టు ఎడిట్ చేయగా.. కింద బ్రిటిష్ పోలీసులు ఈ కాంబో చూస్తుంటే నాకు భయమేస్తుంది అంటున్నట్లు మీమ్ క్రియేట్ చేశారు.
ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో బ్యాచిలర్ మూవీతో పూజ దొబ్బేసింది.. ఇప్పుడు శ్రీలీలనా అని, నీకే హిట్‌కు గతి లేదు అఖిల్‌కి ఏం ఇస్తావ్ అని, శ్రీలీలను చూస్తుంటే మహేష్ బాబుకు లేడీ గెటప్ వేసినట్లు ఉంది అని, ఇది కూడా పక్కా ప్లాప్ అని తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కనుక హిట్ అయితే వీరందరి నోరు మూయించినట్టే అవుతుంది.