- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీని వీడిన కీలక నేతలతో పాటు మరికొందరు ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా.. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇమడ లేకపోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నలుగురిని బహిరంగంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని అన్నారు. ఇటీవల పార్టీని వీడిన వారు తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. తనను తిట్టినా పట్టించుకోనని.. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నవారంతా తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. ఈ క్రమంలో వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కర్ణాటక ఫలితాలపై దేశం మొత్తం చర్చిస్తోందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాటలోనే రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ నడుస్తోందని అన్నారు. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని, త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన పెడతామని ప్రకటించారు.
Also Read..
ప్రారంభమైన తెలంగాణ కేబినేట్ సమావేశం.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ