సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి కీలక హామీ

by Satheesh |   ( Updated:2023-11-18 06:15:24.0  )
సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మరో 66 అశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించగా.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో కీలక హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. విద్యాశాఖలో పని చేస్తోన్న ఎస్ఎస్ఏ (తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు) ఉద్యోగులు వారి న్యాయమైన హక్కుల కోసం నెల రోజుల పాటు ఆందోళన చేసిన విషయం నా దృష్టిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed