- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో వరుసగా జరుగుతున్న పోలీసుల బలన్మరణాల(Police Suicides)పై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao)ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల మరణ మృదంగం..ప్రభుత్వాని(Congress Government)కి పట్టింపు లేదా ? అని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని... శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు( Departmental Investigation)చేయాలని తెలంగాణ డీజీపీ(DGP)ని కోరారు. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ (Counseling with Psychologists)నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పోలీస్ మిత్రులు సైతం సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదని అర్ధం చేసుకోవాలన్నారు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారని.. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండని హితవు పలికారు. విలువైన జీవితాలను కోల్పోకండని.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత అని హరీష్ రావు పేర్కొన్నారు.