Revanth Reddy: రేపు బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by Ramesh Goud |
Revanth Reddy: రేపు బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: నెహ్రూ(Jawahar Lal Nehru) ఆశయాలకు అనుగుణంగా బావి భారత పౌరుల(Future Citizens Of India) అభివృద్దికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. రేపు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. ప్రతి సంవత్సరం నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ బాలల దినోత్సవం(National Children's Day) సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు(Warm Greetings) తెలియజేశారు. అలాగే భావి భారత పౌరులుగా పిల్లలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం(People’s Government) పాఠశాల విద్యలో వినూత్న మార్పులకు(Innovative Changes) శ్రీకారం చుట్టిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ప్రతి సంవత్సరం రెండు యూనిఫారాలు అందించే బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించామని, పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించామని పునరుద్ఘాటించారు. అంతేగాక భావి భారత పౌరులను తయారు చేయడంలో భాగంగా విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టామని గుర్తు చేశారు. నేటి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలనే సంకల్పంతో విద్యారంగ సంస్కరణలో భాగంగా ఇప్పటికే నిపుణులతో కూడిన విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కొత్త నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇక నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల(Integrated Residential schools)ను ప్రారంభించామని, పిల్లలను జాతి సంపదగా భావించి, వారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పిన నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా భావి భారత పౌరులను అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.

Advertisement

Next Story