KCR ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే.. ఒకటే తుపాకీ దెబ్బతో లేపి అవతల వేస్తాం: రేవంత్ రెడ్డి

by Anjali |   ( Updated:2024-04-30 14:09:10.0  )
KCR ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే.. ఒకటే తుపాకీ దెబ్బతో లేపి అవతల వేస్తాం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఇండియా కూటమిలోకి రానివ్వమని అన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలితే ఒక్కటే దెబ్బకు లేపి అవతల పడేస్తామని గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌నే కాదు ఆయన ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాలితే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారని రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read More...

BREAKING: జహీరాబాద్ సాక్షిగా మాదిగలకు ప్రధాని మోడీ కీలక హామీ

Advertisement

Next Story