- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్ధాన్ని నిజం అని చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని, ప్రస్తుతం జీరో అయ్యాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ (రైతు సంఘం) నేతలు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవన్న విషయాన్ని తాను గర్వంగా చెప్పగలుగుతానన్నారు. దీనిపై ఆదివారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ‘ఒకటైతే నిజం..పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్! తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్‌సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. లెక్కకు రానివి ఇంతకు పదింతలు. ‘రైతు స్వరాజ్య వేదిక’సమక్షంలో ఇద్దరం కూర్చుందాం. ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్…సిద్ధమా?! అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
ఒకటైతే నిజం… పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్!
— Revanth Reddy (@revanth_anumula) April 2, 2023
తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు NCRB రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. లెక్కకు రానివి ఇంతకు పదింతలు.
“రైతు స్వరాజ్య వేదిక” సమక్షంలో ఇద్దరం
కూర్చుందాం… ఆత్మహత్యలు… pic.twitter.com/s30g8aS6No