- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న లీడర్: కర్నె ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతర పెట్టిందని, నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ బాధ్యతను గుర్తు చేస్తామన్నారు. తెలంగాణలో అసలు అభివృద్ధి జరగనట్లుగా ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కాంగ్రెస్ దృష్టి సారించాలని కోరారు. కేసీఆర్, హరీష్ రావు,కేటీఆర్‌లపై కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అరువు తెచ్చుకున్న నాయకుడన్నారు. కాంగ్రెస్ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందన్నారు. అబద్దాల హామీలతో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
డిసెంబర్ 9 న రైతురుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పలేదా..? అని ప్రశ్నించారు. వరి పంటకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారన్నారని, గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇస్తామన్నారని ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామం పెట్టిందని, ఓట్లు వేయించుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు.