హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది: సీఎం రేవంత్ రెడ్డి సెటైర్

by Disha Web Desk 9 |
హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది: సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో శుక్రవారం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్దేవా చేశారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్‌ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తదని, వారి మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు, రాజీనామా లేఖ అలా ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని, హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందన్నారు. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్‌ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, నీ రాజీనామా రెడీగా పెట్టుకోమని హరీష్ రావుకు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.



Next Story

Most Viewed