- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అది బాల్ కాదు బాంబు.. బాలుడి మృతితో విషాదం
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు హూగ్లీ జిల్లాలోని పాండువా పట్టణంలో రాజ్ బిస్వాస్ అనే పదకొండు ఏళ్ల బాలుడు ఆడుకుంటూ బాల్ అనుకొని ఓ క్రూడ్ బాంబును కాలితో తన్నాడు. దీంతో అది పేలిపోయింది. పాండువాలోని నేతాజీపల్లిలో ఉన్న కాలువ పక్కన చోటుచేసుకున్న ఈ ఘటనలో బాలుడు రాజ్ బిస్వాస్‌తో పాటు మరో ఇద్దరు బాలురకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని పాండువా రూరల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజ్ బిస్వాస్ పరిస్థితి విషమించడంతో చుంచుర ఇమాంబర ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రాజ్ బిస్వాస్ చికిత్సపొందుతూ మృతిచెందాడు. వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి అతడు వచ్చాడు. గాయపడిన మరో ఇద్దరు బాలురను రూపమ్ బల్లభ్ (13), సౌరవ్ చౌదరి (13)లుగా గుర్తించారు. రూపమ్ చేతులకు గాయాలవగా, సౌరవ్ కాలికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ హూగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుకు టీఎంసీయే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీఎంసీ ఇలాంటి విధ్వంసకర మార్గాలను ఆశ్రయిస్తోందన్నారు. సోమవారం రోజు ఇంకొన్ని గంటల్లో పాండువాలో టీఎంసీ అగ్రనేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ జరగనుండగా చోటుచేసుకున్న ఈ ఘటనతో కలకలం రేగింది.