- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TVS: భారత మొట్టమొదటి బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విడుదల చేసిన టీవీఎస్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టూ-వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ సోమవారం తన కొత్త త్రీ-వీలర్ ఈవీ ఆటోను విడుదల చేసింది. 'కింగ్ ఈవీ మ్యాక్స్ ' పేరుతో తీసుకొచ్చిన ఈ వాహనం పట్టణ ప్రాంతాల కోసం రూపొందించింది. రూ. 2.95 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరలో లాంచ్ చేసిన ఈ వాహనం 51.2వీ లిథియం అయాన్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, కేవలం 2.15 నిమిషాల్లో 0-80 శాతం, మూడున్నర గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వివరించింది. అంతేకాకుండా ఇది భారత మొట్టమొదటి బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అని కంపెనీ ప్రకటించింది. కస్టమర్ల విశ్వాసాన్ని మరింత పెంచుకునేందుకు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్‌కు 6 ఏళ్లు లేదా 1.5 లక్షల కి.మీ. వారెంటీ (ఏది ముందైతే అది) లభిస్తుంది. మొదటి మూడు సంవత్సరాలకు 24 గంటల రోడ్‌సైడ్ సపొర్ట్ అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నావిగేషన్, టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ సదుపాయం, రియల్‌టైం డయాగ్నస్టిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి ఈ వాహనం యూపీతో పాటు బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్‌లలోని డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.