కోహ్లీపై గంగూలీ ప్రశంసలు.. గ్రేటెస్ట్ వైట్‌బాల్ ప్లేయరంటూ కితాబు

by Harish |
కోహ్లీపై గంగూలీ ప్రశంసలు.. గ్రేటెస్ట్ వైట్‌బాల్ ప్లేయరంటూ కితాబు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. విరాట్ గ్రేటెస్ట్ వైట్‌బాల్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. సోమవారం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నిర్వహించిన కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ.. ‘81 అంతర్జాతీయ సెంచరీలు చేయడం అసాధారణ విషయం. ప్రపంచం చూసిన గ్రేటెస్ట్ వైట్ బాల్ ప్లేయర్ అతను.’ అని ప్రశంసించాడు. అలాగే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత విఫలమవడం తనను ఆశ్చర్యపర్చిందన్నాడు. ‘బలాలు, బలహీనతలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అవి లేకుండా ఏ ఆటగాడు ఉండడు. చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఫామ్‌పై నాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే, నేను చెప్పినట్టుగా చాలా కాలంపాటు ప్రపంచం చూసిన గ్రేటెస్ట్ వైట్‌బాల్ ప్లేయర్ అతను. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియానే ఫేవరెట్ అని గంగూలీ తెలిపాడు. గత రెండు వరల్డ్ కప్‌లు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇండియా బాగా ఆడలేదని తెలుసు. కానీ, గత రెండు ప్రపంచకప్‌లను చూడండి. టీ20 వరల్డ్ కప్ గెలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో ఓడిండి. భారత్ అసాధారణమైన వైట్‌బాల్ జట్టు. అందుకే, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫేవరెట్.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Next Story