- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన మూడీస్ రేటింగ్స్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇది అంతకుముందు అంచనా వేసిన 8.2 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. వినియోగం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల కారణంగా వృద్ధి అంచనాలో మూడీస్ మార్పులు చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశీయ ధోరణులతో పాటు అంతర్జాతీయ పరిణామాలు వృద్ధిపై ప్రభావం చూపాయని మూడీస్ తెలిపింది. అయితే, వృద్ధి మిగిన ఆర్థికవ్యవస్థల కంటే సానుకూలంగా ఉండనుంది. మెరుగైన ఆర్థిక వృద్ధి, ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న డిమాండ్‌తో పాటు స్థిరమైన ప్రీమియంల వృద్ధి ద్వారా దేశీయ బీమా సంస్థలు ప్రయోజనం పొందనున్నాయని మూడీస్ రేటింగ్స్ సోమవారం ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం బీమా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, అనుకున్న స్థాయిలో ధరల పెరుగుదల ద్వారా అధిక ప్రీమియంతో పరిశ్రమ లాభదాయకత సానుకూలంగా ఉండనుంది. కొనుగోలు శక్తి కారణంగా దేశ తలసరి జీడీపీ గతేడాది కంటే 11 శాతం పెరిగి రూ. 10,233కి చేరుకుంటుందని మూడీస్ అభిప్రాయపడింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కూడా డిసెంబర్ భారత జిడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. బలహీనమైన పారిశ్రామిక వృద్ధి, తగ్గిన ప్రభుత్వ వ్యయం కారణంగా వృద్ధి అంచనాను 6.5 శాతానికి తగ్గించింది.