ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బ్యూటీ.. ఏకంగా పది సినిమాల్లో చాన్స్!

by Hamsa |   ( Updated:2024-05-06 13:10:09.0  )
ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బ్యూటీ.. ఏకంగా పది సినిమాల్లో చాన్స్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పలు చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. గత ఏడాది రణబీర్ కపూర్‌తో త్రిప్తి ( Tripti Dimri ) యానిమల్ సినిమాలో నటించింది. ఇందులో కీలక పాత్రలో కనిపించిన ఈ అమ్మడు బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. దీంతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ పాపులారిటీ వచ్చి సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. సినిమా విడుదలై కొన్ని నెలలు గడిచి పోయినప్పటికీ త్రిప్తి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె చేసిన సీన్స్‌ను కుర్రాళ్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిప్తికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆ బ్యూటీ చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నట్లు టాక్. టాలీవుడ్‌లో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తుండటం గమనార్హం. దీంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్న వారికి గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన అభిమానులు త్రిప్తి టాలీవుడ్, బాలీవుడ్‌ను షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.

Advertisement

Next Story