Britain's heaviest men: అతి చిన్న వయసులో 317 కిలోల బరువున్న యువకుడు.. చివరికి..?

by Disha Web Desk 3 |
Britains heaviest men: అతి చిన్న వయసులో 317 కిలోల బరువున్న యువకుడు.. చివరికి..?
X

దిశ వెబ్ డెస్క్: బ్రిటన్‌ దేశంలోనే అత్యంత బరువున్న వ్యక్తిగా నిలిచిన జేసన్ హోల్టన్ అనే వ్యక్తి 33 ఏళ్లకే మృతి చెందారు. అధిక బరువు కారణంగా అతనిలో పలు అవయవాలు ఫెయిల్ అయ్యాయి. దీనికారణంగా ఆయన మరణించారు. కాగా అతన్ని కాపాడేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 317 కిలోల బరువున్న హోల్టన్‌ను ఆస్పత్రికి తరలించడం కూడ కష్టంగా మారింది.

ఆయన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరికి అతన్ని క్రేన్ సాయంతో ఇంటి నుంచి రాయల్ సర్రే ఆస్పత్రికి అగ్నిమాపక సిబ్బంది తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని అతని తల్లి లీసా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించింది.

అలానే తన కుమారుడికి రెండు కిడ్నీలు ముందుగా పాడయ్యాయని, దీనితో తన కొడుకు వారం రోజులకు మించి బతకడని డాక్టర్లు చెప్పారని తెలిపారు. కాగా తన కొడకు ఇప్పటికి ఎనిమిదిసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని.. తొమ్మిదోసారి కూడా బయటపడతాడని భావించినా అలా జరగలేదని భావోద్వేగానికి గురైంది.

హోల్టన్‌ 317 కిలోల బరువు పెరగడానికి కారణం..?

హోల్టన్ టీనేజీలో ఉన్నప్పుడే తన తండ్రి మరణించారు. దీనితో మనోవేధనకు గురైన అతను బాధ నుంచి బయటపడేందుకు ఎక్కువగా ఆహారం తినేవారు. క్రమేపీ అదే అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో అతను రోజుకు 10,000 కేలరీల ఆహారం తీసుకొనేవారు. దీనితో 33 ఏళ్లకే 317 కిలోల బరువు పెరిగారు. అధిక బరువు కారణంగా కదలలేని స్థితికి చేరుకున్నారు.

దీనితో మంచానికే పరిమితమైయ్యారు. ఈ క్రమంలో శ్వాసకోస సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అలానే రక్తం గడ్డకట్టడం వల్ల రెండుసార్లు స్వల్ప పక్షవాతానికి కూడా గురయ్యారు.

Next Story

Most Viewed