Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ!

by Ramesh Goud |
Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు(Tomorrow) మరోసారి ఢిల్లీ బాట(Delhi Tour) పట్టనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో(AICC Leaders) సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యి చర్చించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సీఎం రేవంత్ మరో సారి హస్తినకు పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో(States Politics) తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేత(Congress Leaders)ల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకునే కాంగ్రెస్ నేతల లిస్ట్ ఢిల్లీ పెద్దలకు చేరింది. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story