Revanth: ప్రియాంక గాంధీ నయా రికార్డ్!.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-11-23 06:41:06.0  )
Revanth: ప్రియాంక గాంధీ నయా రికార్డ్!.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: వయనాడ్(Wayanad) లో ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi)కి భారీ విజయం(Grand Victory) చేకూరబోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆనందం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు వయనాడ్ ఉప ఎన్నిక(Wayanad By Election) కౌంటింగ్(Counting) ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో 3.21 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదటి ట్రెండ్‌లో మా నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతోందని చెప్పారు. అలాగే వయనాడ్ ప్రజలు ఈ రోజు భారీ మెజారిటీ ఇచ్చి కొత్త రికార్డ్ నమోదు చేయబోతున్నారని, ప్రియాంక గాంధీ భారీ విజయంతో పార్లమెంట్ లో అరంగేట్రం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక తధ్యమయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రియాంక గాంధీని నిలబెట్టింది.

Advertisement

Next Story

Most Viewed