- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు గేమ్ మొదలెట్టిన రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వర్సెస్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన బీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం నాటి మర్యాదలు క్రమంగా ముగిసిపోతుండటంతో ఇరు పార్టీల మధ్య హామీల అమలు, వైఫల్యాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ శ్వేతపత్రం విడుదుల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా డోస్ పెంచడంతో అసలు ఆట మొదలైందా అనే చర్చ జరుగుతోంది.
ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్న ప్రభుత్వం ఆ మరుసటి రోజే విద్యుత్ శాఖపై వైట్ పేజీని రిలీజ్ చేయడం ఈ సందర్భంగా గత ప్రభుత్వం స్కామ్ లకు పాల్పపడిందని ఆరోపించడంతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏకంగా రూ.10 వేల కోట్లు మింగేశాడని నిండు సభలో ప్రభుత్వం పక్షం ఆరోపణలు గుప్పించడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టాను రేవంత్ రెడ్డి సర్కార్ క్రమంగా విప్పబోతున్నదా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నది అన్న చర్చ ఆసక్తిగా మారుతున్నది.
టార్గెట్ ఫిక్స్:
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలలోనే అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. గత పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు శ్వేతపత్రాల ద్వారా నిరూపించే ప్రయత్నానికి తెరలేపింది. ఈ మేరకు నిన్న రాష్ట్ర అప్పులు, ఆదాయాల వివరాల లెక్కలను అసెంబ్లీ ముందుంచిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే విద్యుత్ రంగంపై వైట్ పేపర్ ను రిలీజ్ చేసింది. దీంతో డిఫెన్స్ లో పడిన బీఆర్ఎస్ తామెక్కడా తప్పు చేయలేదని.. అప్పులు మాత్రమే చూడవద్దని వాటి ద్వారా సృష్టించబోడిన ఆస్తులను చూడాలంటూ కొత్తవాదనను తెరమీదకు తీసుకువచ్చింది.
ఇంతలో గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై గురి పెట్టిందిది. ఇంతలో తమ హయాంలో జరిగిన ఒప్పందాలు, ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయగా ఆ సవాల్‌ను ముఖ్యమంత్రి స్వీకరించడం అదే సభలో విచారణకు ఆదేశిస్తామని విచారణకు అవసరమైన అన్ని చర్యలను డిప్యూటీ సీఎం, మంత్రులు చూసుకుంటామని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇటీవలే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై న్యాయవిచారణకు రెడీ అని చెప్పిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ రంగంలోని అవకవతకలపైకూడా ఎంక్వైయిరీకి సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఇవాళ ఓ వైపు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సర్కార్ మరో వైపు ఇరిగేషన్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించడం చర్చనీయాశంగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ కుటుంబ అవినీతిపై టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
మాజీలకు టెన్షన్:
గతంలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పాలనలోని అవినీతిపై అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేస్తూ విచారణకు సైతం వెనుకాడబోమని సీఎం సంకేతాలు ఇస్తుండటంతో గులాబీ పార్టీలోని ముఖ్యనేతలలో టెన్షన్ మొదలైందనే చర్చ జరుగుతోంది. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతిపై మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలోనే ఆరోపించడంతో గత ప్రభుత్వం హయాంలో తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్కామ్ లపై ఫోకస్ పెట్టిన సర్కార్ తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పై నజర్ వేయడంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు ఎవరిపై గురి పెట్టబోతున్నదనేది సందేహంగా మారింది. దీంతో రేవంత్ సర్కార్ అసలు ఆట మొదలు పెడితే ఎక్కడ తమ మెడకు కత్తి వేళాడాల్సిన పరిస్థితి వస్తుందో అనే ఆందోళన బీఆర్ఎస్ హయాంలో అవకతవకలకు పాల్పడిన నేతలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.