- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ఓటమి.. రాష్ట్రంలో మొదలైన రాజీనామాల పర్వం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం మారుతుండడంతో వివిధ బాధ్యతల్లో ఉన్న పలువురు రిటైర్డ్ అధికారులు రాజీనామాలివ్వడం మొదలుపెట్టారు. సాంస్కృతిక సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి, ట్రాన్స్ కో-జెన్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు ఇప్పటికే రాజీనామా చేశారు. చీఫ్ సెక్రటరీకి లేఖలను పంపినట్లు ఆయా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. మరికొద్దిమంది కూడా సాయంత్రానికి రిజైన్ చేసే ప్రాసెస్‌లో ఉన్నారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ గతంలోనే రిటైర్ అయినా కేసీఆర్ వారిని వివిధ పదవుల్లో నియమించారు. మరికొద్దిమందిని అవే విభాగాల్లో ఎక్స్ టెన్షన్ లేదా మరో రూపంలో కొనసాగించారు. దీర్ఘకాలంగా వారు ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడంతో ఆయన హయాంలో నియమితులై కొనసాగుతున్నవారు రాజీనామా చేయాలనే ఆలోచనలో పడ్డారు. రిటైర్డ్ అధికారులను వివిధ హోదాల్లో నియమించారని రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్ల ప్రస్తావించి కేసీఆర్ పనితీరును విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో లాంఛనంగా ప్రభుత్వం ఏర్పాటుకావడానికి ముందే తప్పుకోవాలని చూస్తున్నారు. అందులో భాగమే రాజీనామాల పర్వం.