CM Himanta : టాప్-5లోకి అసోం చేరలేదు.. టాప్-7లోకి సీఎం హిమంత చేరారు : కాంగ్రెస్

by Hajipasha |
CM Himanta : టాప్-5లోకి అసోం చేరలేదు.. టాప్-7లోకి సీఎం హిమంత చేరారు : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోనే సంపన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం(Assam) సీఎం హిమంత(CM Himanta) బిస్వశర్మ ఏడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. దీనిపై అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్(Gaurav Gogoi) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హిమంత ఏడో సంపన్న సీఎంగా ఎదిగిపోగా.. అసోం రాష్ట్రం మాత్రం మానవాభివృద్ధి సూచికలో 31వ స్థానానికి పరిమితమైందని ఆయన విమర్శించారు. సీఎం వ్యక్తిగత సంపద వేగంగా పెరిగిపోగా.. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి అంతే వేగంతో జరగకపోవడం శోచనీయమన్నారు.

‘‘వికాస్ అనేది బీజేపీకే పరిమితమని ఈ లెక్కలతో స్పష్టంగా తెలిసిపోతోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అసోం ప్రజలకు బీజేపీ ఇస్తామని చెప్పిన డెవలప్‌మెంట్ ఇదేనా ? ’’ అని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ‘‘దేశంలోని టాప్-5 రాష్ట్రాల సరసన అసోంను చేరుస్తానని సీఎం హిమంత చెప్పారు. అది సాధ్యం కాలేదు. కానీ హిమంత సంపన్న సీఎంగా ఎదగడం సాధ్యమైంది’’ అని ఆయన మండిపడ్డారు. ఎన్‌డీఏ కూటమి పాలిస్తున్న నాలుగు ఈశాన్య రాష్ట్రాల సీఎంలు టాప్-10 సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో చోటు సంపాదించారని గౌరవ్ గొగోయ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed