- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: CMR కాలేజీ వద్ద హైటెన్షన్.. సెక్యూరిటీ రూం ధ్వంసం
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా CMR కాలేజీ వద్ద హై టెన్షన్ నెలకొంది. లేడీస్ కాలేజీ హాస్టల్ బాత్ రూమ్‌లో వీడియోలు రికార్డులు చేశారని గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల చర్చలతో వివాదం సర్దుమనిగిందని అనుకుంటే తాజాగా మళ్లీ చెలరేగింది. ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు జత కలిశాయి. దీంతో కాలేజీ వద్ద తల్లిదండ్రులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో తల్లిదండ్రులతో పోలీసులు చర్చించారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడంతో తల్లిదండ్రులు శాంతించారు. కానీ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఎంతకీ తగ్గడంలేదు. కాలేజీ హాస్టల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో కాలేజీ గేట్లను యాజమాన్యం బంద్ చేశారు. అయినా సరే గేట్లను బద్దలు కొట్టుకుని లోపలి వెళ్లి ధర్నా చేస్తున్నారు. అంతేకాదు సెక్యూరిటీ రూమ్‌ను ధ్వంసం చేశారు. లేడీస్ హాస్టల్‌లో వీడియోలు రికార్డు చేసిన వారిని వెంటనే శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ వద్ద మరోసారి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తు్న్నారు. కాలేజీ హాస్టల్ కిటికీ వద్ద చేతి వేళ్లు కనిపించడంతో కేసు దర్యాప్తులో వేగం పెంచారు.