- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు వడ్డీతో కలిపి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆర్టీసీకి కూడా రూ. 7 కోట్లు బకాయి చెల్లించాలి. ఈ వ్యవహారంపై రిటైర్ట్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రభుత్వ, కార్పొరేషన్స్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇట్లా ఫేవర్ చెయ్యడం దురదృష్టకరం. రాజకీయ నాయకులు ఇట్లా అధికారం దుర్వినియోగం చేయడం సిగ్గు చేటు. రాజకీయాలను వ్యాపారం చెయ్యడం ఈ దేశానికి పట్టిన దరిద్రం. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద సరైన విధానం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Advertisement
Next Story