- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ శాఖలో సంచలనాలకు కేరాఫ్ దాసరి భూమయ్య అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలివేస్తారా…? అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా దాసరి భూమయ్యపై అరెస్ట్ మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది.
పోలీసు శాఖలో పదవీ విరమణకు ముందు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో భూమయ్య కారు నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆయనపై కేసు నమోదు కాలేదు. ఇక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో తుపాకుల మాయం విషయంలోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే అవి దొరకడంతో ఆ విషయం అంతటితోనే సద్దుమణిగిపోయింది. పదవీ విరమణ తర్వాత భూమయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం క్రియాశీలకంగా పని చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న టీంలో చేరి రాష్ట్ర కన్వీనర్‌గా పని చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుండి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్న బీజేపీకి మద్దతుగా ఉన్నారన్న కారణంగా కొంతకాలం మల్లన్న టీం నుండి వైదొలిగారు.