వీడిన సస్పెన్స్.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖరారు

by Gantepaka Srikanth |
వీడిన సస్పెన్స్.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీసీ నేత వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అందరూ ఊహించిన విధంగానే పార్టీ పగ్గాలను బీసీ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఇవాళ ఏఐసీసీ పెద్దలు నిర్వహించిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ముందుగా మరో బీసీ నేత, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కీ గౌడ్‌కు ఇస్తారని అంతా భావించారు. అంతకుముందు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేరు సైతం వినిపించింది. అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉండటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావించి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.




Advertisement

Next Story

Most Viewed