రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా

by GSrikanth |
రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా.వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటిమీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story