సెక్రటేరియట్‌ను ఉస్మానియాకు ఇవ్వండి.. కేసీఆర్‌కు రెసిడెంట్ డాక్టర్లు లేఖ

by GSrikanth |
సెక్రటేరియట్‌ను ఉస్మానియాకు ఇవ్వండి.. కేసీఆర్‌కు రెసిడెంట్ డాక్టర్లు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సెక్రటేరియట్​భవనాన్ని ఉస్మానియా ఆస్పత్రికి ఇవ్వాలని హెల్త్ కేర్​రిఫార్మ్స్ డాక్టర్స్​అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మించడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏళ్లుగా నాన్చుడి ధోరణిని అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. పాత షెడ్స్, వార్డుల్లో పేషెంట్లకు చికిత్స అందించడం వల్ల వారికి ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయని, డాక్టర్లకు సైతం సమస్యలు వస్తున్నాయని వివరించారు. ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ నిర్మించేవరకూ ఆస్పత్రిని సెక్రటేరియట్‌లో కొనసాగించాలని, దీంతో రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ప్రభుత్వంపై ఉంటాయని హెచ్‌ఆర్ డీఏ మహేశ్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed