- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పబ్ నా కూతురిది కాదు.. మాజీ కేంద్రమంత్రి స్ట్రాంగ్ రియాక్షన్
X
దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో తన కుమార్తె తేజస్వినిపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తెలిపారు. తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తన కుమార్తె పుడింగ్ అండ్ మింక్ పబ్ యజమాని కాదని, పబ్ స్థాపన నిర్వహణలో ఆమె పాలు పంచుకోలేదన్నారు. తన కుమార్తె తేజస్విని చౌదరిపై కొన్ని మీడియా ఛానళ్లలో తప్పుడు వార్తలు ప్రసారమయ్యాయని, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించలేదన్నారు. తన కూతురిపై వచ్చిన వార్తల్లో ఏది నిజం లేదని, అన్ని అసత్యాలేనని తెలిపారు. మీడియా సంస్థలు వాస్తవాలను నిర్దారించుకుని వార్తలు ప్రసారం చేయాలని కోరారు.
Advertisement
Next Story