TS EAPCET 2024: తెలంగాణ ఎంసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల

by Ramesh N |
TS EAPCET 2024: తెలంగాణ ఎంసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఈఏపీసీఈటీ (ఎంసెట్) ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ఈ క్రమంలోనే అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 14న ఉదయం 10 వరకు అవకాశం ఉందని ఉన్న విద్యామండలి వెల్లడించింది. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీ లు విడుదలైన విషయం తెలిసిందే. వీటిని అధికారిక వెబ్ సైట్ https://eapcet.tsche.ac.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,54,543 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed