TS: ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

by GSrikanth |
TS: ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు 22న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29న పోలింగ్ జరుగనుంది.

అదే రోజు పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అనంతరం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పదవి కాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది.

Advertisement

Next Story