- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి ‘TG’ అనే పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గీతంగా నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) ట్వీట్ పెట్టారు. భాష, సాంస్కృతిక వారసత్వాలే జాతి అస్థిత్వానికి చిరునామా అని పేర్కొన్నారు. వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సగటు ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపం అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. రాచరిక పోకడలు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుందని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌లు TG తోనే అవుతాయని అన్నారు. TS బదులుగా TG ఉండాలనేది ఉద్యమనాటి ఆకాంక్ష అని తెలిపారు.
కాగా, ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గీతంగా, తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, రాష్ట్ర అధికారిక చిహ్నం (ఎంబ్లమ్-రాజముద్ర)లోనూ తగిన సవరణలు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో ఇక నుంచి టీజీ అని పేర్కొనేలా మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరో రెండింటిని కూడా లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ గ్యారంటీలపై ప్రకటన చేయనున్నారు.