నేషనల్ మీడియాకు రెడ్ కార్పెట్.. తెలుగు మీడియా పాసులకు ‘నో’

by Sathputhe Rajesh |
నేషనల్ మీడియాకు రెడ్ కార్పెట్.. తెలుగు మీడియా పాసులకు ‘నో’
X

దిశ, తెలంగాణ బ్యూరో : మొదటి నుంచి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియాపైన ఆంక్షలు విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా మీడియాపై మరోసారి ఆంక్షలు అమలయ్యాయి. కొన్ని ఎంపిక చేసిన పత్రికలు, టీవీ ఛానెళ్ళకు మాత్రమే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఎంట్రీ పాసులను జారీచేసింది. అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకునేలా భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనలను కూడా ఇచ్చింది. కానీ కవరేజి విషయంలో మాత్రం పరిమిత సంఖ్యలోనే పాసులను అందజేయడంతో జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈస్ట్ వైపు ఎంట్రీ గేట్ వరకే మీడియాకు అనుమతి లభించింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మీడియా, మహారాష్ట్ర నుండి మీడియా ప్రతినిధులను 70 మందిని తీసుకువచ్చి వారిని నేరుగా నూతన సచివాలయం లోపలికి అనుమతిచ్చారు. ఇక జాతీయ మీడియాకు సైతం భారీగా ఎంట్రీ పాసులు ఇచ్చిన ప్రభుత్వం.. స్థానిక తెలుగు మీడియాకు మాత్రం పాసులు ఇవ్వకుండా గేటు బయట కూర్చునే విధంగా వ్యవహరించింది. దీనితో తెలుగు మీడియా ప్రతినిధులు ఎండలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు మీడియాకు సంబంధించి ప్రగతి భవన్ నుండి పంపిన లిస్ట్ ప్రకారమే పాసులు జారీ చేశారు.

Advertisement

Next Story