రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేమ్ హిమజ!

by GSrikanth |
రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేమ్ హిమజ!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఫామ్‌హౌజ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా రేవ్ పార్టీని భగ్నం చేశారు. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో పాటు 11 మంది సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. ఎక్కడికక్కడ పోలీసులు వీటిని అడ్డుకుంటున్నా.. నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో మరోసారి ప్రముఖుల పిల్లలు పట్టుబడటం కలకలం రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed