- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో:రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేరు వేరుగా ఇస్తామని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేషన్ కార్డుల అంశంపై త్వరలోనే కేబినెట్ లో చర్చిస్తామని చెప్పారు. రేషన్ కార్డులకు అర్హులు ఎవరు? ఎవరెవరికీ ఇవ్వాలనే దానిపై మంత్రివర్గంలో చర్చించాక మార్గదర్శకాలు ఖరారు చేస్తామన్నారు. గైడ్ లైన్స్ ఖరారైన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడాతామని చెప్పారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువస్తామని రేషన్ కార్డు రేషన్ సంబంధింత అంశాల కోసం వినియోగిస్తే ఆరోగ్యశ్రీ కార్డు కేవలం వైద్యానికి సంబంధించి విషయాలకు ఉపయోగపడేలా కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ కాదని చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
బీఆర్ఎస్ అంటేనే మోసం, దగా :
రుణమాపీ విషయంలో బీఆర్ఎస్ చేస్తన్న విమర్శలపై మంత్రి ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేయడంతో వారికి ఏం చేయాలో పాపం అర్థం కావడం లేదని సెటైర్ వేశారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులకు రూ. 25 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోపే రూ.31 వేల కోట్ల రుణాల మాఫీ మేము చేశారు. దీంతోనే రైతులకు ఎవరు ఎక్కువ రుణమాఫీ చేశారో స్పష్టం అవుతున్నదన్నారు. బీఆర్ఎస్ అంటేనే మోసం, దగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్లండర్ మిస్టేక్ అని బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నీళ్ల కోసం కాకుండా నిధుల కోసం కట్టారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రానికి అనేక సందర్భాల్లో కోరామని రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు:
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు క్యూ కట్టిన నేపథ్యంలో ఇంకెవరెవరు పార్టీలో చేరబోతున్నానరే అంశంపై ఉత్తమ్ స్పందించారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ నామమాత్రంగా మిగిలిపోబోతున్నదని ఉత్తమ్ హాట్ కామెంట్స్ చేశారు. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇంతకంటే తాను ఎక్కువ విషయాలు చెప్పలేనన్నారు.