- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేవలం వారికే రూ. 500 లకు గ్యాస్ సిలిండర్?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ దుకూడుగా వ్యవహరిస్తుంది. ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా ఆయా శాఖల మంత్రులు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటైన రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు గ్యారంటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. వంద రోజుల్లో 6 గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా 6 గ్యారెంటీల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ స్కీం పై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కేవలం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వానికి అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ కలెక్టర్లతో రివ్య్యూ అనంతరం సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.