- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వాతంత్య్ర వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
దిశ, తాండూరు : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు విద్యుత్ షాక్ తగిలి చనిపోయిన ఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రోడ్లపై ఉన్న మున్సిపల్ విద్యుత్ స్తంభాలకు త్రివర్ణ రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాదుకు చెందిన వహీద్ అనే వ్యక్తికి విద్యుత్ అలంకరణ పనులను రూ.9 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీంతో ఫరూక్ రెండు రోజుల నుండి సదరు కాంట్రాక్టర్ వహీద్ కార్మికులతో పనులు చేయిస్తున్నాడు. అసంపూర్తిగా పనులు ఆగాయి. తిరిగి ఈరోజు ఉదయం నుండి పనులను ప్రారంభించారు. దీంతో ఈ విద్యుత్ అలంకరణ పనుల్లో ఫారూక్ అనే కార్మికుడికి విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. ఆ మార్గంలో వస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తించారు. దీంతో ఫారూక్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గ మద్యలోనే మృతి చెందాడు. దాంతో స్థానికంగా విషాదం నెలకొంది.