అక్రమ నిర్మాణాలపై కొరడా

by Sridhar Babu |
అక్రమ నిర్మాణాలపై కొరడా
X

దిశ, బంట్వారం : బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాటింగ్ ను తొలగించినట్లు తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధి లోని తుర్మామిడి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 302 లో కొందరు అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాటింగ్ ను తొలగించినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ, ఆస్తులు కానీ ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, గిర్దావర్ రాంగోపాల్, పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed