నీటి కరువుతో గొంతెండుతున్న తాండూర్ ..!

by Sumithra |
నీటి కరువుతో గొంతెండుతున్న తాండూర్ ..!
X

దిశ, తాండూరు రూరల్ : తాండూరు గొంతెండుతోంది. నీళ్ల కోసం జనం పుట్టెడు కష్టాలు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్లకు మైళ్లు దూరం వెళుతున్నారు. పల్లె, పట్నం అని తేడా లేదు. అన్ని చోట్ల అదే గోస. తండా, పల్లెల్లో నీళ్ల కోసం నిత్యం సమరం సాగుతున్నది. నీటి జాడ దొరికితే చాలు ఆడ, మగా, పిల్లాజేల్లా బిందెలు పట్టుకొని పొలాల, గుట్టలు దాటుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచిన కనీస అవసరాలైన నిరు తిండి దొరకడం జనం గగనంగా మారింది. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారినా కానీ గ్రామాలతోపాటు గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మార్పుల్లి, పార్వత్ పల్లి, జలాల్ పూర్, తాండూరు మండలం ఉద్ధాండాపూర్, గుండ్లమడుగు తండా, మైసమ్మ తండా ఇతర పల్లెల్లో ఆదివారం తీవ్ర నీటి సమస్య ఏర్పడింది.

4,5 రోజుల క్రితం గాలిదుమారం వల్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. సంబంధిత ఖాశాధికారులు విద్యుత్ సమస్యను పరిష్కరించలేకపోవడంతో త్రీఫెజ్ కరెంట్ లేక గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బిందెడు నీళ్ల కోసంవారు మైళ్లు దూరం నడిచి వెళ్తున్నారు.మరీ కొందరు ఎడ్ల బండి, బైక్ ల పైన నీళ్లు మోసుకొక తప్పడంలేదు. ఊరికి కిలోమీటర్లు దూరంలో ఉన్న చేతి పంపు నీళ్లు మోసుకుంటూ ప్రతినిత్యం ఎన్నో అష్టకష్టాల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టిపెట్టి కనీసం వారికి వేసవి కాలం దృశ్య మంచినీటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారుగొంతు తడవాలంటే 2కిలోమీటర్లు వెల్సిందే..! దీంతో తాగునీటి కోసం వ్యవసాయ బావిని ఉపయోగిస్తున్నప్పటికీ, 4,౫ రోజుల క్రితం గాలిదుమారం వల్ల విద్యుత్‌ కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత శాఖాధికారులు విద్యుత్‌ సమస్యను పరిష్కరించలేకపోవడంతో త్రీఫేజ్‌ కరెంట్‌ లేక గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోని కలుషిత నీటినే తాగునీటిగా వాడడంతో రోగాల బారిన పడుతున్నామని పలువురు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఏదైనా విద్యుత్‌ సమస్య ఎదురైతే రోజు ల తరబడి అంధకారంలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఈ సమస్యపై సంబంధిత విద్యుత్‌ అధికారులను సంప్రదించినా స్పందించడం లేదని వారు వాపోతున్నారు. నీటి సమస్యతోపాటు విద్యుత్‌ సమస్యను, రోడ్డు సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోవట్లేదని ప్రజలు తెలిపారు.చేతి పంపు నుంచి 15నిమిషాలకు బిందెనీళ్లు..! గ్రామాల్లో మిషన్భగీరథ పైపులు లీకవుతున్నా మరమ్మత్తులు చేయించే వాళ్లే లేరు.

గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉండటం, పైప్ లైన్లు పట్టణాలకు దూరంగా ఉండటంతో అధికారులు ఆ దిశగా వెళ్లేందుకే ఆసక్తి చూపడం లేదు. మరికొన్ని చోట్ల కాలిపోయిన మిషన్భగీరథ మోటార్లు రిపేరింగ్ కు నోచుకోవడం లేదు. అంతేకాదు.. ట్యాంక్ ల క్లీనింగ్ పేరిట ఏజెన్సీ ఏరియాల్లో నీటిని వారం, పది రోజుల పాటు విడవడం లేదు. దీంతో గిరిజన మహిళలు మంచి నీటి కోసం బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లు అందని ఆదివాసీ గ్రామాల ప్రజల కష్టాలు మరింత దారుణంగా ఉన్నాయి. ‘మిషన్ భగీరథతో ఇంటింటా నల్లా నీరు’ అని ప్రభుత్వం చేసిన ప్రచారంతో ఆదివాసీ గ్రామాల ప్రజలు చేతి పంపులు, బోర్లను పట్టించుకోలేదు. తమ ఇంటికీ నల్లా నీరు వస్తుందన్న ఆశ నీరుగారిపోవడంతో ప్రజలు మళ్లీ చేతి పంపుల కోసం పరుగెత్తారు. పని చేయని చేతి పంపులు, ఎండిన బోర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో మహిళలు దిక్కులు చూస్తున్నారు.

Advertisement

Next Story