వెలగని సెంట్రల్ లైటింగ్.. 5 నెలలుగా రాత్రిపూట వణుకుతున్న జనాలు..

by Nagam Mallesh |   ( Updated:2024-08-16 10:19:03.0  )
వెలగని సెంట్రల్ లైటింగ్.. 5 నెలలుగా రాత్రిపూట వణుకుతున్న జనాలు..
X

దిశ, యాచారంః మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలుగా రాత్రిపూట లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. తిరుమలేశుని గుట్ట వద్ద నుండి గాండ్లగూడ గేటు వద్ద, మొండి గౌరెల్లి గ్రామానికి వెళ్లే రహదారి ప్రభుత్వ పాఠశాల పక్కన వీధిలైట్లు వెలగకపోవడంతో చీకట్లు అములుకుంటున్నాయి. చీకటితో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story