- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Siege : అనుమతులు లేని పాఠశాల సీజ్

దిశ, కొల్చారం: మండల కేంద్రమైన కొల్చారంలో ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయబడిన లేక్ వ్యూ టాలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను బుధవారం ఎంఈఓ నీలకంఠం సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న పాఠశాల గుర్తింపును జిల్లా విద్యాశాఖ అధికారి గత నెలలో రద్దు చేశారు. అయినప్పటికీ పాఠశాల కొనసాగిస్తుండడంతో బుధవారం ఎంఈఓ నీలకంఠ సిబ్బందితో కలిసి వెళ్లి పాఠశాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు తెలిపారు. గుర్తింపు రద్దు చేయడం వల్ల పాఠశాల విద్యార్థుల పేర్లు యుడైస్ లో నమోదు కావు.కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చేర్పించవద్దన్నారు. పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించి తిరిగి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తిరిగి గుర్తింపు పొందిన తర్వాత పాఠశాల ప్రారంభించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Telugu News
- Siege