రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం

by Mahesh |
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గంల్లో కార్యకర్తలను గాలికి వదిలేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు సై అంటున్నారు. బీఆర్ఎస్​, బీజేపీలు ఎమ్మెల్యే, ఎంపీ స్ధానాలను ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతున్నట్లు స్పష్టమైతుంది. పార్టీ అధిష్టానం మాటకు కట్టుబడి పని చేస్తున్నారు. అదే కాంగ్రెస్ ​పార్టీలో అధిష్టానం మాటకు విలువ ఉండదు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే దుస్థితి లేదు. కేవలం ఆధిపత్యం కోసం ఆరాటం మాత్రమే కాంగ్రెస్​ పార్టీలో కనిపిస్తుంది. నియోజకవర్గాల్లో ఇప్పటికి ఓ సరియైన నేత లేకపోవడంతో కాంగ్రెస్​ శ్రేణులు అయోమయంలో పడ్డారు.

రాష్ట్ర స్థాయిలో సీనియర్లు, జూనియర్లు అనే గోడవతోనే కాలం వెల్లదీస్తున్నారు. అదే దారిలో జిల్లాలో నడుస్తుంది. దీంతో కార్యకర్తలు నమ్ముకున్న పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామనే ఆవేదనలో ఉన్నారు. బీఆర్ఎస్​ పార్టీపై క్షేత్రస్ధాయిలోనున్న వ్యతిరేకతను తమవైపు తీప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైతుందని తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ పార్టీకి అంతర్గతంగా కాంగ్రెస్ నాయకులు మద్దతు పలుకుతున్నారనే ఆపవాద లేకపోలేదు. ఇవన్ని పరిశీలిస్తే కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేసేందుకు రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క నేత పనిచేయడం లేదని స్పష్టమైతుంది.

ఇక్కడ వర్గాలు..

జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో నేతలు ఉన్నప్పటికి ప్రయోజనం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బలమైన నేతగా పెరున్న మల్​రెడ్డి రంగారెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ నేతల వైఖరితో స్పష్టమైతుంది. హాథ్ ​సే హాథ్ ​జోడో యాత్ర పేరుతో మల్​రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్​రెడ్డి, దండెం రామిరెడ్డి, ఈసీ శేఖర్​గౌడ్‌లు ఎవరికి వారే యాత్రలు చేశారు. పార్టీలో వర్గాలు ఉన్నట్లు బహిర్గతమైతున్నాయి. ఎల్బీనగర్‌లో మల్​రెడ్డి రాంరెడ్డి, జక్కడి ప్రభాకర్​రెడ్డిలు నువ్వా నేనా అన్నట్లు ఉన్న బలమైన నాయకులు కారనే అభిప్రాయం స్థానికంగా ఉంది. మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, బడంగ్​పేట్​మేయర్​చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి, దేప భాస్కర్​రెడ్డిలు కాంగ్రెస్​టికెట్​కోసం పోటీ పడుతున్నారు.

కానీ పార్టీని బలోపేతంలో చేయడంలో విఫలమైతున్నారు. జిల్లా అధ్యక్షుడుగా చల్లా నర్సింహ్మారెడ్డి పార్టీకి నమ్మిన బంటే కానీ పోటీని తట్టుకునే వ్యక్తి కాదనే అభిప్రాయం లేకపోలేదు. చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డికి బడంగ్​పేట్ కార్పొరేషన్ పరిధిలో మంచి పేరు, వ్యక్తిత్వం ఉన్నప్పటికి నియోజకవర్గంలో పట్టు సాధించలేదనే చెప్పవచ్చు. పార్టీ కష్టకాలంలో కూడా దేప భాస్కర్​రెడ్డి అండగా ఉన్నారు. కానీ ఆయన పార్టీ అధిష్టానం నియోజకవర్గం అభ్యర్ధిగా గుర్తించడం లేదని పలు సందర్భాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎవరి వర్గం వారుగా విడిపోయి పనిచేస్తున్నారు.

సమన్వయ నేతలేరీ..?

చేవెళ్ల, కల్వకుర్తి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ కాపాడుకోవడంలో విఫలమైతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంతో సంబంధం లేని నేతలు పోటీలో ఉంటున్నట్లు ప్రచారం రావడంతోనే స్థానిక కాంగ్రెస్ శ్రేణులు భయబ్రాంతులకు గురైతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఆశావాహులు అధికంగానే ఉన్నప్పటికీ ఎవరికి టికెట్​వస్తుందో లేదో అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. దీంతో టికెట్ ఎవరికి వస్తుందో తెలియకపోవడంతో కాంగ్రెస్​ కార్యకర్తలు డైలామాలో అన్నారు.

ఇటీవల కాలంలోనే సిహెచ్ సత్యనారాయణరెడ్డిని నియోజకవర్గం సమన్వయం చైర్మన్‌గా నియామించారు. కానీ అక్కడ పరిస్థితి మారలేదు.. అంతేకాకుండా బీఆర్ఎస్​కు లోపాయికారిగా నాయకులు పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీని అభిమానించే నేతలు అనేకం. కానీ వంశీచందర్ రెడ్డి నియంతృత్వ పోకడలతోనే కాంగ్రెస్ క్యాడర్​ దూరమైతుందనే ప్రచారం సాగుతోంది. ఎంపీకి, ఎమ్మెల్యేకి నేనే పోటీ చేస్తానంటూ కార్యకర్తలను అయోమయానికి గురి చేయడమే వంశీచందర్​రెడ్డి లక్ష్యమని స్థానిక నేతలే అంటున్నారు.

షాద్​నగర్‌లోనే...

రంగారెడ్డి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క షాద్​నగర్​నియోజకవర్గంలోనే కాంగ్రెస్​పార్టీ బలంగా ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్​పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయడం, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వీర్లపల్లి శంకర్​కే దక్కుతుంది. హాథ్​సే హాథ్​ జోడో యాత్ర కార్యక్రమం పూర్తిస్థాయిలో నడిపించింది ఒక్క షాద్​నగర్​ నియోజకవర్గమని తెలుస్తోంది. అక్కడ వీర్లపల్లి శంకర్‌కు వ్యతిరేకంగా కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్​ఉన్నప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్​కార్యకర్తలు ప్రతినిత్యం అందుబాటులో ఉండే నేతగా ముద్ర వేసుకోవడమే కాంగ్రెస్‌కు కాలిసోచ్చింది.

Next Story