తెలంగాణ ప్రత్యేక దేశం కావాలి.. ఎమ్మెల్యే సమక్షంలో హోరెత్తిన నినాదాలు (వీడియో)

by Disha News Web Desk |
తెలంగాణ ప్రత్యేక దేశం కావాలి.. ఎమ్మెల్యే సమక్షంలో హోరెత్తిన నినాదాలు (వీడియో)
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర విభజనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని పలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దహనం చేసి, నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళనలు చేపట్టారు. అయితే, కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన ఆందోళనలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న నినాదాలు చేశారు. తెలంగాణను ప్రత్యేక దేశంగా చేసేవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేశామో... తెలంగాణను ప్రత్యేక దేశం చేయాలని పోరాటం చేస్తామని కార్యకర్తలు, నాయకులు నినాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed