అతను ఆ టైంలోనూ ఆత్మ విశ్వాసం చూపాడు.. మెగా హీరోపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
అతను ఆ టైంలోనూ ఆత్మ విశ్వాసం చూపాడు.. మెగా హీరోపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో తన నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’(virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘SDT 18’ అనే మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నిన్నటితో ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) సాయి ధరమ్ తేజ్‌(Sai Dharamtej)పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాయి ధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' (Pilla Nuvvu Leni Jeevitham) సినిమా విడుదలై గురువారంతో పదేళ్లు కావడంతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ''నటుడిగా తేజ్ అన్ని విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తాడు. గతంలో రోడ్డు యాక్సిడెంట్ అయిన టైంలోనూ ఆత్మ విశ్వాసం చూపాడు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ రాకూడదనే ఆలోచనతో రోడ్ యాక్సిడెంట్స్‌కు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చైతన్య పరుస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిన వారిపై, పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు.. సాయి దుర్గా తేజ్‌లోని సామాజిక బాధ్యతను తెలియజేస్తోంది. ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడు. హీరోగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story