- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురికి తీవ్ర గాయలైన ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని డెహ్రాడూన్ (Dehradun)లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్ (Dehradun)లోని ఢిల్లీ జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్ట్ వద్ద సెల్స్‌టాక్స్ అధికారులు (Sale Tax Officers) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని చెక్ చేసేందుకు ఆపమని కోరగా.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో వెనకాలే ఉన్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అదేవిధంగా కంటైనర్ ట్రక్ కిందపడి పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ దుర్ఘటనలో సుఖ్‌దేవ్ (Sukhdev) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.