మూడు కార్లు ఢీ.. ఇద్దరి మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

by Nagam Mallesh |
మూడు కార్లు ఢీ.. ఇద్దరి మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
X

దిశ శంషాబాద్ : శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఇద్దరికి మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఒక కుటుంబంలోని 12 మంది TS 06 UB 1687 అనే నెంబర్ గల తుఫాన్ వాహనంలో యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుకాల వస్తున్న బలెనో (TS 22 B 7599) కారు అతివేగంగా వచ్చి దాని ముందు వెళ్తున్న నిస్సాన్ టెరినో (TS 08 ED 8753) కారును ఢీ కొట్టింది. దీంతో ఈ నిస్సార్ టెరినో కారు దాని ముందు వెళ్మున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో తుఫాన్ వాహనంలో ఉన్న 12 మందిలో డ్రైవర్ తాజ్ (40) దీక్షిత (12) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అందులో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story