గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. కలెక్టర్ ప్రతీక్ జైన్

by Nagam Mallesh |
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ, బొంరాస్ పేట్ః గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం బొంరాస్ పేట్ మండలంలోని నాందార్ పూర్, లింగన్ పల్లి గ్రామ పంచాయతీ భవనాలను తిరుపతిరెడ్డి, కలెక్టర్ ప్రారంభించారు. కొడంగల్ పురపాలక కేంద్రంలోని బాలాజీ నగర్ లో 69 లక్షలతో నిర్మిస్తున్న పాఠశాలకు, అప్పాయిపల్లి రోడ్డుకు శంకుస్థాపనలు చేశారు. పాటిమీదిపల్లి, హుస్సేన్ పూర్, టేకులకోడ్ గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా తిరుపతిరెడ్డి, కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాతీలపై ప్రత్యేక ద్రుష్టి సారించిందన్నారు. గ్రామ పంచాయతీ భవనాలను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్లు జయకృష్ణ, శివకుమార్ గుప్తా, పార్టీ అధ్యక్షులు నర్సిములుగౌడ్, నందారం ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, వెంకట్ రాములు గౌడ్, రాంచంద్రరెడ్డి, రాజేష్ రెడ్డి, నయీమ్, ఎంపీడివో వెంకన్నగౌడ్, ఏంపీవో మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story