- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
దిశ, గండిపేట్:- ఎగువ ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎగువ రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద నీటితో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్( గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండి..నిండు కుండను తలపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ముందు జాగ్రత్త లో భాగంగా ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు 242 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ ఒక గేటును ఒక ఫీటు మేర ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైన సాయం కావాలంటే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జలమండలి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.