- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్క వానకే చెరువును తలపిస్తున్న ఫ్లైఓవర్ వంతెన..

దిశ, శంకర్ పల్లి : చిన్నపాటి వర్షం కురిసినందుకే ఫతేపూర్ ఫ్లైఓవర్ వంతెన కింద చెరువును తలపిస్తూ రాకపోకలు నిలిచిపోయాయి. ఇది ఎక్కడో కాదండోయ్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ వంతెన కింద శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఫతేపూర్ గ్రామ శివారులోని ఓ సిమెంట్ కంపెనీ వారి వాహనాలు ఫ్లైఓవర్ వంతెన కింది నుంచి వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని వారి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ రోడ్లు భవనాల శాఖ అధికారులు వంతెన కింద గుంత తవ్వి సిమెంట్ రోడ్డు వేసి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని చేశారు.
కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే వర్షపు నీరు మురుగు కాలువల నీరు ముందుకు వెళ్లే మార్గం ఏర్పాటు చేయడంలో అటు హైదరాబాద్ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించడంతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలోనూ అకాల వర్షాలు కురిసిన సమయంలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి నెల కొన్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపించడంలో అటు ప్రజాప్రతినిధులు గాని ఇటు సంబంధిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఫ్లై ఓవర్ కింద నిలబడే వర్షపు నీరు ముందుకు వెళ్లేందుకు మార్గం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారి రోదన అరణ్య రోదన గానే మిగిలిపోయింది.
స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి..
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు పరిధిలో పత్తేపురం ఫ్లైఓవర్ వంతెన కింద వర్షం కురిసిన సమయంలో నీరు నిలబడి రాకపోకలు నిలిచిపోయాయి. శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డు చేవెళ్ల వెళ్లే రహదారులకు ఈ వర్షపు నీరు తో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. మహాలింగాపురం లక్ష్మా రెడ్డి గూడెం గాజుల గూడెం మైతాబ్ ఖాన్ గూడ మోమిన్ పెట్, మోర్ పల్లి, చందిప్ప, రామంతపూర్, ఎలవర్తి, కొజ్జా గూడా, ఈర్లపల్లి టంగుటూరు ఎన్కెపల్లి, కమ్మేట తదితర గ్రామాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం ఈ వంతెన కింద నుంచి స్థానిక చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్తుంటారు. కానీ సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారు. గతంలో ఓ పర్యాయం పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఫతేపూర్ గ్రామస్తులు సమస్యను వివరించగా రైల్వే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు.
పదో తరగతి విద్యార్థుల ఇబ్బందులు..
శనివారం ఉదయం 10 వ తరగతి పరీక్షలు రాసేందుకు వివిధ గ్రామాల నుంచి శంకర్పల్లి లోని పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహాలింగాపురం, గాజుల గూడా, లక్ష్మారెడ్డి గూడ, ఫతేపూర్ చందిప్ప ఆలం కాని గూడా, రావులపల్లి కలాన్, చెన్నారెడ్డి గూడ ఎలవర్తి కొజ్జా గూడ, రామంతపూర్, టంగుటూరు తదితర గ్రామాల నుంచి పదో తరగతి పరీక్షల కోసం వచ్చే విద్యార్థులు ఈ వర్షపు నీటి నుంచి దాటేందుకు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.